నాకు నచ్చినవి కొన్ని రాస్తున్న

1)తేనె తియ్యగ ఉంటది,కానీ నోట్ల వేసుకుంటెనే తియ్యగుంటది.

2)నాకు కలలు ఉన్నయ్ అనుకునుడు కాదు దమ్ముంటే సాధించాలె.

3)కష్టాలు ఎవడికి ఉండవు? మీ అమ్మా నాన్న చెప్పిన జాబులు చేసెటోనికి కష్టాలు లేవా? హీరోలకి లేవా , ప్రతి పనిలో కష్టముంటది , ఆ కష్టమేదో నీ కలలని నిజం చేసుకోవటానికి ఎందుకు ఉపయోగించవు?

4)నీ కలని సాధించుకోవటం అంటే యుద్దం చేస్తున్నట్టే , విజయమో స్వర్గమో అంతే మధ్యల ఒడిలేస్తె పారిపోయినట్టే.

5)గొప్పోళ్లు అయినోళ్లు ఎవరూ కష్టపడకుండా పైకి రాలేదు మన ఖర్మ ఏమిటంటే అందరూ వాడికి పేరొచ్చాక వాడి గొప్పతనం గురించి మాట్లాడతారు కానీ వాడు పడ్డ కష్టాలగురించి మాట్లాడరు , మనకి కావలసింది అది. 

6)ఏంది బయట చాలామంది చెడ్డోళ్లున్నరా , ఇంటికి మంచినీటి నళ్లా ఉంటది డ్రైనేజీ ఉంటది  నువ్వు దేంట్లనుంచి నీళ్లు తాగుతవనేది నీ ఇష్టం. 

7)విజయానీకి మెట్లు లాంటి పుస్తకాలు చదవటం కాదు ఆచరించాలి , ఆచరణ లేనిదే ఏదీ కాదు.

8)వడ్లు ఓ కిలో తీసుకపోయి పొలం దున్ని విత్తనాలు వేసి పండిస్తె ఓ బస్తాడు అవుతయి , నువ్వు కష్టపడ గొప్పవాన్ని అవుతా అంటె వడ్లు నాటకుండ బస్తాడు చేస్తా అన్నట్టే.గుర్తుంచుకో అలా ఎప్పటికీ కాదు. చివరగా ఒక మాట ఏదో ఒకరోజు నీ అంతరాత్మకి నువ్వు సమాధానం చెప్పుకోవలసి ఉంటది , నువ్విప్పుడు ఎలా బతుకుతున్నా సరే ఎంత సంపాదించినా సరే … సమాధానం చెప్పుకునే రోజు ఒచ్చినప్పుడు నవ్వుతూ నేను ఎప్పుడూ ………… అని చెప్పేలా ఉండు.

వ్యాఖ్యానించండి