అప్పుడెప్పుడో రాసుకున్న కవితలు

ఇగో ముందే చెపుతున్న ఎప్పుడొరాసుకున్నవి..బాగా లేకుంటే ఏమనొద్దు 🙂

౧)

నిన్ను మించిన స్నేహం ఇంకొకటి లేదు

నిన్ను మించిన అందం ఇంకోటి లేదు

నా కోసమే పుట్టిన నా ప్రాణమా

త్వరగా వచ్చి నాలో కలసిపోవా

నా నీడవై నా తోడువై

౨)

సూర్యుడి కోసమే కదా ఉదయం

నీ కోసమే కదా నా హృదయం

మాట్లాడుకోవటానికే కదా మనమిద్దరం

మౌనం కూడా మనిద్దరిమధ్య మాట్లాడుతుంది

రాత్రి కూడా మనకోసం మెలకువగా ఉంటుంది

ఐనా….

ఇవన్నీ నీకు తెలియనివా

నువ్వు నేనూ ఒకటేగా…

౩)

వాడిపోయిన పువ్వు రాలిపోతుంటే

చెట్టందట……..

నే ఏమి చేసాను వదిలి వెళ్లిపోతున్నవు అని

అపుడా పువ్వు చెప్పిందట……

విరబూసి ఉన్నపుడు నీకు దూరంగా అయినా ఉండగలను ,కానీ ఇప్పుడు నీతొ ఉండలేను

ఎందుకంటే……..

వాడిపోకముందు గుర్తొచ్చి బాధపెడుతుంది….

అదే నేను రాలిపోతే నీనుండి వచ్చే కన్నీరు కూడా నాకు సంతోషమే

అయినా….

నువ్వు చెట్టువి నాలాంటి పూలు నీకు చాలా వస్తాయి కానీ నాకు మాత్రం నీలాంటి చెట్టు మళ్లీ రాదు…

అపుడా మళ్లీ ఆ చెట్టు పూవుతో అంది..

అవునూ…ఆ పూలన్నీ మళ్లీ నువ్వే ఎందుకు కాకూడదు అని..

ఆ పువ్వు రాలిపోయింది

ఆ చెట్టు మళ్లీ పూతపూసింది.

౪)

నువు దురంగా ఉన్నపుడు ఎపుడూ నన్ను తలచుకోకు,

ఎందుకంటే నే ఎపుడు నీకు దగ్గరగానే కదా ఉంటా……..

నువు నా మనసులోకి ఎపుడు రావాలనుకోకు,

ఎందుకంటే నువు ఎపుడూ నా కళ్లలోనే కదా ఉంటావు….

నువ్వు నేను ఒకేలా ఉండాలని ఎపుడూ అనుకోకు

అంతకంటే అబద్దం వేరొకటి ఉండదు

ఎందుకంటే మనం ఎప్పటినుంచో ఒకటే కదా…..

మౌనంలో మాట్లాడుకోవటం……

దుఖం లో నవ్వుకోవటం…….

ఒంటరిగా కలిసుండటం….

జంటగా మనకు ఎప్పటినుండొ అలవాటే కదా…

మనం ఎన్నటికి విడిపోము….

ఎందుకంటావా….

నువ్వు నా నీడవైతే చీకట్లో విడిపోతావవేమో….

కానీ

నువ్వు నా ఆత్మవి కదా ఎలా విడిపోతావ్……

వ్యాఖ్యానించండి