అనంతమైన ఆలోచనలు

నా ఆలోచనలు..నా దారి…

“ఇప్పియాయియో….”

హా!

అరె హా! అనగానే హెంత హాయిగా ఉందో…మరే మ్మీరుకూడా ఓసారి అనుకుని సదవటం మొదలెట్టండి………..

నాకు నా పేరుకన్నా ఇష్టమైన పదం “ఇప్పియాయియో….” ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో వినగానే నాకోసమే ఈ పదం అననుకున్నా….

అసలిక అలా అనుకున్నప్పన్నుండి రోజుకోసారైనా మనమా పదాన్ని గట్టిగా అరవాల్సిందే……

కానీ ఇష్టాలు కూడా కొన్ని సార్లు కష్టాలు తెస్తాయి… కదా…అవును…నాక్కూడా…వచ్చాయి…

మొదట యేంటంటే..మా నాన్న కి ఈ పదం నచ్చలే..నాకు నచ్చినవి నాన్నకి నచ్చవ్…

నేను   “ఇప్పియాయియో….” అనగానే మా నాన్న “ఆనాచెప్పుతేండ్రో..”వీన్ని తన్నాలి అనేవాడు..అంతే నేను చెప్పులుకూడా ఏసుకోకుండ పరిగెత్తేవాన్ని….

ఇక ఇంకోసారి నేను..బాబాయి..ఓ పెద్ద p.v.c పైపుని భుజాల మీద మోస్తు మా ఊరి వాగులోనుండి మా పొలానికి తీసుకెలుతున్నాం ..అసలే ఎండాకాలం మండుతుంది ఇసుక ..మా ముందు ఓ ముసలోడు నడుస్తున్నాడు..ఆడు జరిగితేనే మేము ముందుకి వెళ్ళాలి..ఆడు పోడు త్వరగా మమ్మల్ని పోనివ్వట్లే..మా బాబాయి ముందు..నేను వెనక ..ఆ ముసలోడు మా బాబాయి ముందున్నాడు..బాబాయేమో వాన్ని జరగమనట్లే..నాకేమో కాలిపోతోది..చూస్తే బాబాయి భుజం మీది పైపు కొన ఆ ముసలాయన చెవి కి కాస్త దూరంలో ఉంది..నేను జాగర్తగా నావైపు పైపు దగ్గర నా నోరు పెట్టి నా కోపాన్నంత నా గొంతులో పెట్టి “ఇప్పియాయియో….” అనరిస్తే ముసలోడు భయపడి “ఒరెక్కొ..నీ #$%^$#@!^%&*^&” అనబోయి నా అరుపుకి పైపు కిందపదేసి నన్నే చూస్తున్న బాబాయి ని చూసి ఒస్తున్న మాటలు గొంతులోనే ఆపుకుని ’ఏందయగారూ..గట్ల ఒర్రిండ్రు’ అన్నడు..

మూడోది చెప్పుకోవాలంటే కాస్త సిగ్గేస్తోది..అయిన మీరే కద పర్లే చెప్పేస్తా….

మా చుట్టాలింట్లో పెళ్ళి….నే వెళ్లా…పొద్దున్నే మా ఓడు ఒకడు దారా నాకు అర్జెంటు..ఊరు కొత్త నాతో రా చెరువు దగ్గరకు అన్నాడు..సర్లే అని వెళ్లా…వాడు నే నా పని చూసుకుంటా ను అని చెప్పి ఓ మాంచి చెట్టు చూసుకు వెళ్ళిపోయాడు..నేను కాస్త దూరంలో ఖాళీ స్ఠలం చూసి అక్కడికెళ్లా …పక్కనే చెరువు పొద్దున్నే ఆ వాతావరణం పిట్టల అరుపులూ అబ్బో మస్త్ పరవశించి పోయి “ఇప్పియాయియో….” అనరిచా అంతే చెట్ల చాటు నుండి ఆడవాళ్లు ఒచ్చి “అడోళ్లు %‍ఽఽ‍%॓॓॑॑॓‍ జాగల్ నీకేం %‍%॓‍%॓‍%‍%॓*&&^#$@!@$%$#$% ” అని తిట్లు మొదలుపెట్టారు…నేను “ఇప్పియాయియో….” బదులు ఉర్కురో అనుకుని పరిగెత్తా…

ఇక మా నల్లెద్దు మా ఇంటికొచ్చిన కొత్తలో దాన్ని పొలానికి తీసుకెళ్లాం నేను..బాబాయి… నాకు అప్పటికి దాని సంగతి అంతగా తెలీదు…అది గడ్డి తింటూ పక్కనే ఉన్న వరిచేలోకి పోతోది బాబాయి అరిచాడు నేను చూసి “ఇప్పియాయియో….” అని అరుచుకుంటూ దాన్ని కొట్టడానికి వెళ్ళాను…

కానీ ఆ నల్లెద్దు చాలా మొండి..దానికి చాలా కోపం అని నాకర్దమైంది..ఎలా అంటారా..

అదినా వెంటపడింది…నా చేతిలో కర్ర ఎక్కడ పడిందో..ఏమో తెలీదు..దాన్ని తరమటానికి వెళ్ళిన నన్ను అది తరమటం మొదలు పెట్టింది….వెళ్లేప్పటి నా అరుపు “ఇప్పియాయియో….” అది నా వెంటపడేసరికి “బాబాయో..” గా మారిపోయింది…..

మా నల్లెద్దు కి ఓ పోస్ట్ పక్కన పెడ్తా…………

ఇలా నా జీవితంలో “ఇప్పియాయియో….” కొన్ని మధుర గట్టాలు ఒదిలింది…

నేను మీరు ఏ పోస్ట్ చదవటానికి రాగానే ఏంచెప్పాను…..

హా! అనుకోమన్నానా…….

ఇప్పుడనిపిస్తుందా హా!తొక్కలో దీనిక్కూడా పోస్టా అని….

అయితే గట్టిగా గాలి పీల్చుకోండి…ఇప్పుడు వదిలేయండి..గట్టిగా…..

గట్టిగా…..

గట్టిగా…..

గట్టిగా…..

“ఇప్పియాయియో….”

అనండి…..

ఇక ఇప్పుడు కామెంట్ రాయండి….

ఆగష్టు 17, 2009 Posted by | మా ఊరా మజాకానా [కోలుకొండ కథలు] | | అభిప్రాయములు

నేను-బాబాయి-తమ్ముడు-పిన్ని-ఓ పాము.

అది ఒక రోజు సాయంత్రం నేనూ,మా తమ్ముడు మా ఊరికి వెళ్లాం అక్కడ మా పొలాల్లోబాగా తిరిగి సాయంత్రం మా ఇంటికి వచ్చాం.నేనూ,తమ్ముడు,బాబాయ్ ముగ్గురంపేకాట మొదలుపట్టాం టైంపాస్ కి.మా పిన్ని,చిన్న తమ్ముడు లోపల వంటింట్లోఉన్నారు.

మా ఊరిలో మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది.అందులోనూ మేము కూర్చున్న రూం చాలా పెద్దగా ఉండి మధ్యలో చిన్న గోడలాగా ఉంటుంది గోడకి అటువైపు పండిన పంట,పురుగుమందులు లంటివి ఉంటాయి ఇటువైపు ఖాళీ గా ఉన్నచోట మేము కూర్చున్నం మాకు సరిగ్గా గోడకి ఆ వైపున ఒక కబోర్డ్ ఉంది.మెల్లిగా మేము మాటల్లో దిగాం మా పిన్ని కూడా వచ్చి మాతో మాట్లాడుతూ కూర్చుని పాములు ఎక్కువయ్యయని,ఇంట్లోకి కూడా వస్తున్నాయని చెప్పటం మొదలుపెట్టింది.అసలే డిస్కవరీ చానల్ బాగా చూస్తానేమో నేను ఇంట్రస్ట్ గా వినటం మొదలు పెట్టాను.ఇంతలో గోడకి ఆవలివైపు శబ్దాలు స్టార్ట్ అయ్యాయి,మేము ఏ పిల్లో ,ఎలకో అని లైట్గా తీసుకున్నాము.

మా పిన్ని వంటింట్లో కి వెళ్లి ఏదో పని ఉందని పిలవగానే బాబాయి,తమ్ముడు ఇద్దరూ వంటిట్లోకి వెళ్లారు,నేను ఒక్కన్నే ఆ రూం లో చేసేదేం లేక ఆ ఇద్దరి ముక్కలూ చూసేసి కాం గా సెట్టు లోంచి నాకు కావాల్సిన పేక ముక్కలు తీసుకుంటుంటే శబ్దాలు ఇంకా ఎక్కువగా రావటం మొదలయింది,మనం వెంటనే షెర్లాక్ హోంస్ లాగా ఏదో కనిపెడదామని ఒక చేతితో కర్ర ఇంకో చేతిలో టార్చి లైట్ పట్టుకుని  కాసేపు వెతికినా ఏమీ కనపడలేదు.సరే అని వచ్చేసా కాసేపటికి బాబాయి వాళ్లు వచ్చేసారు ఇక కాసేపయ్యాక అసలు ఒక మనిషే అక్కడ ఉండి దేని కోసమో వెతుకుతున్న రేంజ్ లో చప్పుడు రాసాగింది.నేను బాబాయి లేచి టార్చ్ వేసి చూస్తుంటే ఆ కబోర్డ్ మూడవ అరలో ఒక చిన్న ఆకారం ఎగురుతూ ఉంది.దాని పక్కనే ఒక లెదర్ బెల్ట్ లా కనిపించింది,ఏదో ఎలుక పక్కనున్న డబ్బాలోకి ఎగురుతుందేమో అని బెదిరిద్దాం అని కాస్త ముందుకు వెళ్లగానే ఆ చిన్న ఆకారం చాలా ఫాస్ట్ గా పైకి లేచి ఆ డబ్బా లోకి వెళ్లిపోయిందో లేదో ఆ లెదర్బెల్ట్ దాని వెనకే కదిలి ఆ డబాలోకి వెళ్లటం కనిపించింది,ఒక రెండు సెకన్లు అయ్యేలోపు అర్దమయింది అది పామని మేము ఎలుక అనుకుంది దాని తలని.

ఇంతకీ ఆ పాము దూరింది మేము పొగాకు నారుకు నీళ్లు పోసే దానిలో –అదే గార్డెన్ లో మొక్కలకి నీళ్లు పోస్తారే ఒక వైపు షవర్ లాగా ఉండి పైన బకెట్లాగా ఉంటుంది.

వెంటనేఈవార్తమాఇంట్లోప్రసారంఅయిపోయింది.నేను,బాబయి,పిన్ని,తమ్ముడు,చిన్న తమ్ముడు అందరం నిలబడి అల్మారా వైపు చూస్తుండగా ఒకేసారి బాబాయి నా వైపు,నేను పిన్ని వైపు,పిన్ని తమ్ముడివైపు,తమ్ముడు చిన్న తమ్ముడివైపుచూడగానే వాడికి విషయం అర్దమై పరిగెత్తుకెళ్లి మా జీతగాడి ఇంటికి వెళ్లి పిలుచుకొచ్చాడు.

వాడు వచ్చి ఆ పాముని బయటకు తీసే పనిలో ఉండగానే నేను అక్కడ పరచి ఉన్న మంచాన్ని నిలబెట్టి ఆ మంచం పట్టె పైన కూర్చుని పైన ఉన్న ఇంటి దూలాన్ని పట్టుకున్న అందరూ నన్ను చూసి ఒకటే నవ్వు అంత భయమా అని ,కా నీ డిస్కవరీ లోపాముని చూడటానికీ,నిజం పాముని చూడటానికీ తేడాఉండదూ….

మా జీతగాడు జేంస్ బాండ్ లా రంగం లోకి దిగి కబోర్డ్లో మూడవ అరనుండి సామాన్లు తీయబోతుంటే సడన్ గా మేడం నో లాగా మా పిన్ని వచ్చి అందులోకాదు పాము కింది అరలో దూరింది అని చెప్పింది వెంటనే నేను కాదు మూడవ అరలోనే ఉంది అని చెపితే నీకేమీ తెలీదు కాం గా మంచం పైన కూచో అని అన్నారు,మనం సరేలే అని యాక్షన్ సినిమాలో ఫస్ట్ కాం గా ఉండే హీరో లాగా కూర్చుని చూడసాగాను.

కాసేపయ్యాక ఆ చీకటిగా ఫాన్ లేని గదిలో ఆ అరలోంచి సామాన్లన్నీ తీసి మా జీతగాడు చాలా రిలీఫ్ గా చూసాడు వెంటనే మా పిన్ని పాము లేదు పోయింది అసలు పాము అంటెనే పది ఆమడలు పోతది అనగానే అందరూ కబోర్డ్ దగ్గరకు వెళ్లి నిలబడ్డారు

మళ్లీ సామాన్లు అన్ని సర్దబోతున్నారు.  నన్ను చూసి పాము లేదు ఏమి లేదు దిగిరా అంటె నేను రానన్నాను వెంటనే మా చిన్న తమ్ముడి తో సహా అంతా ఒకటే నవ్వులు అందర్లోకి మా చిన్న తమ్ముడు చాలా ఎక్కువ చేసాడు వాడు నన్ననే మాటలకి మా జీతగాడు కూడా చులకనగా రెండు మూడు మాటలన్నాడు.

నేను వెంటనే ఆ పై అరలో తియ్యి అన్నాను అయితే అప్పటికే పాము కింది అరలో ఉందని పిన్ని చెప్పటం వల్లో ఏమో మార్టిన్ మిస్టరీ లో మార్టిన్ లా మా జీతగాడు చాలా కేర్లెస్ గా తీయటం మొదలుపెట్టాడు అన్ని సామానులు  తీసేసి ఆ పాము దూరిన డబ్బా చేతిలో పట్టుకుని దాన్ని ఊపుతూ ఏది అయ్యగారూ పాము,పాము లేదు ఏమీ లేదు సుకుమారం ఎక్కువయ్యి నీకు అట్ట అనిపిస్తుంది అన్నాడు అనేసి ఇంకా ఆ డబ్బా ను ఊపుతూనే ఉన్నాడు ముందుకీ వెనక్కీ.

నేను వెంటనే ఆ మంచం పట్టె పై రెండు కాళ్లు పెట్టి పైన దూలాన్ని గట్టిగా పట్టుకుని ఆ డబ్బాని కిందకి వంపు అన్నాను అసలు ఏమీ ఆలోచించకుండా వెంటనే వాడు దాన్ని కింద వంపాడు  అంతే నాలుగు అడుగుల పాము బయటపడ్డది విచిత్రమేమిటంటే మా వాళ్లంతా దాని చుట్టూ గుమిగూడి ఉన్నారు అది డబ్బాలోంచి బయట పడగానే అందరూ పెద్దగా అరుస్తూ బయటకు వచ్చారు నాకు నవ్వు ఆగట్లేదు ఇక మా చిన్న తమ్ముడైతే మా ఇంటి గడప,మాఇంటి గేట్,మా వీధి దాటి ముందు వీధి లో వీధి లైట్ కింద పామూ పామూ అని అరుస్తూ నిలబడ్దడు మా పిన్ని పిలిచినా కూడా అరగంట వరకూ ఇంట్లోకి రాలేదు.

కొసమెరుపు: పాము ఎక్కడుందో మొదలు చెపితే నమ్మని మా వాళ్లు తరువాత పాము ఎక్కడికి వెళ్లిందని మళ్లీ నన్ను అడిగారు,ఎందుకంతే అప్పుడు నేను యాక్షన్ సినెమా సెకండ్ హాఫ్ లో  హీరోని ……

మే 1, 2009 Posted by | మా ఊరా మజాకానా [కోలుకొండ కథలు] | అభిప్రాయములు

   

Follow

Get every new post delivered to your Inbox.