అనంతమైన ఆలోచనలు

నా ఆలోచనలు..నా దారి…

వద్దద్దనుకు౦టూనే…వచ్చినట్టు౦ది….వుద్యోగ౦….

అది ౨౦౦౫[2005] సంవత్సరం…నేను అప్పుడే [M.C.A] చేసాను…

నేను ఎమ్.సి.ఎ లో చేరినప్పుడు ఐ.టి కి 

 

అంత బూమ్ లేదు..అందరు వద్దన్నారు..కానీ నేను అందులోనే చేరాను..

చివరికి ఒక అమ్మాయి అడిగింది…ఎందుకు  ఎమ్.సి.ఎ,ఎమ్.బి.ఎ చెయ్యొచ్చు కదా ? అని.. 

నేనడిగాను ఎందుకు ఎమ్.బి.ఎ ? అని..

అప్పుడు  తనంది..ఎమ్.బి.ఎ అయితే [Management side] కి వెళ్లొచ్చు..మంచి జాబ్..మంచి జీతం అని….

అప్పుడు నేను రజనీ లెవెల్లో ఓ దైలాగ్ చెప్పాను….

“చూడు బేబీ!…నేను భూతకాలం,భవిష్యత్ కాలం లో బతకను..వర్తమానం లో నే బతుకుతాను…చదువుకునేపుడు కేవలం నేర్చుకోవటం అంతే..నా చదువైపోయాక నేను పదిమందికి ఉద్యోగం ఇస్తానా..లేక పదిమంది దగ్గరకు ఉద్యోగం కోసం  తిరుగుతానా అనేది నా సత్తా పైన ఆధారపడి ఉంటుంది …నాకు ఎమ్.సి.ఎ అంటే ఇష్టం…అందులోనే చేరతా అన్నా….

పాపం తను చప్పట్లు కొట్టింది….ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలిస్తే నన్ను కొడుతుందేమో……

[Personal:నీ గురించి రాయాలనున్నా రాయలేను నా బ్లాగ్ లో ..నీ గురించి నేను ఏమీ రాయను లే ..సో ఫీల్ కాకు..కాకపోతే నువ్ ఈ పోస్ట్ చదివి నీకు ఆ రోజు గుర్తొస్తే మెయిల్ చెయి]

సరే చివరాఖరికి ఎమ్.సి.ఎ అయిపోయి రోడ్డు మీదకి వచ్చా….

ఓ మంచి రోజు చూసుకుని రెండు జతల బట్టలు..ఓ చెప్పుల జత..ఓ బూట్ల జత..కొంచెం పొగరు..కొంచెం భయం..పట్టుకొని  హైద్రాబాద్ లోకి వచ్చా..అదీ దొంగలు.. తిరిగే టైం రాత్రి ౨:౦౦[2:00]గంటలకు….

అలా అలా హైద్రాబాద్ లో అమ్మాయిలను చూస్తూ కాలం గడిపేస్తున్న కాలం లో మా శ్యామ్ గాడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది  

ఓ రోజు…… 

“తమ్ముడూ!అసెంబ్లీ కి వెళదామా..సమావేశాలు చూద్దాం!”అన్నాడు శ్యామ్…

“అన్నయ్యా!ఎక్కడికి రమ్మన్నా ఒస్త..పని లేక చస్తున్నా రూమ్ లో” అన్నాను నేను…

కట్ చేస్తే….

అసెంబ్లీ ముందు నేను..ఇంకోడు ఎదురుచూస్తూ నిల్చున్నాం…

మా శ్యామ్ గాడు ఓ ౨౦[20] నిముషాలు లేట్ గా వచ్చాడు…..

ఏంట్రా? అంటే ఇంటర్వ్యూ కి వెళ్లాను..అన్నాడు

“అమ్మ నీ! మాకు ఈ ప్రోగ్రాం అని చెప్పి నువ్ ఇంటర్వ్యూ కి పోతవా..మాకు జాబ్ లొద్దా” అంటే అప్పుడు చెప్పాడు [IEG]  గురించి.

మళ్లీ కట్ చేస్తే పడీ పడీ నవ్వుతున్నాం అసెంబ్లీ లో ..ఎర్రబెల్లి దయాకర్ రావు కామెడీ కామెడీ కాదు ఆ రోజు…  ”స్పీకర్ దగ్గరకు వెళ్ళి గొడవ చేస్తుంటే.. స్పీకర్,ఎర్రబెల్లి దయాకర్ రావు ని వెళ్లి తన కుర్చీలో తనని కూర్చోమన్నడు..అంతే..

“ఏంటి అంతా నీ ఇష్టమేనా..నువ్ చెప్తే మేం వినాల్నా” అన్నడు ..కేక ..విజిటర్స్ అంత నవ్వుతున్నరు..కొన్ని కామెంట్లు కూడా వచ్చాయి..”మరి అసెంబ్లీ ల స్పీకర్ కాకుండ ఇంకెవరు చెపితె వింటడో అని…”సరే అలా ఎంజాయ్ చేసి ఇలా బయటికి  ఒచ్చామో లేదో మళ్ళీ [IEG] గుర్తొచ్చింది…

ఇది జరిగిన రెండు మూడు రోజులకు ఈనాడు లో ఓ బాక్సు లో [IEG] గురించి  బా…….గా………రాసారు.కేక..తురుము…కత్తి…అని ..అది చదివి అబ్బో అనుకొని [IEG] కి,[Airforce] కి అప్ప్లై చేశాను… 

ఆ తరవాత చాలా రోజులకి వేరే సైటు చూడ్డానికి నెట్ సెంటర్ కి వెళ్ళి మెయిల్ ఓపెన్ చేస్తే [IEG] నుండి ఓ మెయిల్ వచ్చిఉంది..అది ఎప్పుడో నా చిన్నప్పుడే వచ్చింది నేను చాలా లేట్ గా చూసా..౧౦-౧౨-౨౦౦౫[10-12-2005] న నన్ను వచ్చి బ్యాచ్ లో జాయిన్ కమ్మంటే నేను మెయిల్ చూసిందే ౨౦-౧౨-౨౦౦౫[20-12-2005] తరవాత అప్పటికే ఆ బ్యాచ్ అయిపోయింది.అరెరె అనుకొని ఫోన్ చేస్తే పర్లే ఇంకో రెండు రోజుల్లో ఇంకో బ్యాచ్ ఉంది వచ్చేయమన్నారు వాళ్ళు..అబ్బో అనుకొని ఇంటి కి వెళ్ళి మొత్తం చెపితే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరున్న మొత్తం తిట్లు తిట్టి దీనికన్నా పో అని పంపారు..

బాలానగర్ నుండి మొహిదీపట్నం..నరకంరా బాబూ..పొద్దున్న ఆరింటినుండి రాత్రి ఎనమిదింటి వరకు ట్రయినింగు అది కూడా [writtentest,interview] కోసం..రోజూ వెళ్ళటం..రావటం ఇంతలో మేము మా రూమ్ ని సఫిల్ గూడా కి మార్చాం.మా ట్రయినింగు పదిరోజులయితే నేను వెళ్ళింది ఏడు రోజులు..ఆ రోజు డిసెంబర్ ముప్పయిఒకటి..వచ్చే సంవత్సరం ఇదేనాటికి అసలు చాలా మంది ఫ్రెండ్స్ ఉండాలి..ఫోన్ లు..మెసేజి లు..అసలు రెండు నిముషాలకో మెసేజి..నాలుగు నిమిషాలకో కాల్ ఉండాలి అనుకున్నా..కానీ తట్టుకోలేక ఫోన్ నెంబర్ మార్చాల్సిన పరిస్తితి వస్తదనుకోలే అప్పుడు[సరే ఇది వేరే పోస్ట్ కోసం వదిలేద్దాం..పక్కనపెట్టేద్దాం]  

అలా ట్రయినింగు అయిపోయిన తరువాత ఇక రిటన్ టెస్ట్ జనవరి రెండు అనుకుంటా ఆ రోజు….

ఆ రోజు మామూలుగానే తెళ్ళారింది..ఎప్పటిలాగే సూర్యుడు ఆరింటికే వచ్చాడు..నేను మాత్రం తొమ్మిదింటికి లేచాను..కరెక్ట్ గా తొమ్మిదింటికి ఎగ్జామ్ మొదలు కానీ నేను అప్పుడే లేచాను..సరే  తొమ్మిదింటికి లేచిన నేను “ఏం పోతంలే” అని ఓ అయిదు నిముషాలు…”పోతే ఏంటి” అని ఓ అయిదు నిముషాలు..”సర్లే పోదాం..ఏమైతే అదైతది” ఓ అయిదు నిముషాలు ఆలోచించి పావుగంటలో రెడీ అయి తొమ్మిదిన్నరకి బయలుదేరి పదకొండు గంటలకి ఆఫీసుకి వెళ్లి మూడు అంతస్తులు ఎక్కి పైన ఎగ్జామ్ రూమ్ కి వెళితే అక్కడ ఒక ఇద్దరున్నారు..మిగతా వాళ్ళు అక్కడ  ఎగ్జామ్ రాసి కింద లాబ్ లో ఉన్నారు రాసిన ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేయటానికి…

లోపలికి వెళ్ళి..”సార్!” అన్నాను..

“ఏంటి..ఏం..కావాలి..ఇక్కడికి ఏందుకొచ్చావ్!?”అన్నాడు..

“ఎగ్జామ్ రాయటానికి వచ్చాను సార్!” అన్నాను నేను..

విచిత్రంగా నావైపు చూసి “ఇంకో గంటలో అయిపోతది,ఎప్పుడు ప్రోగ్రాములు రాసి ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తవ్?”అన్నాడు..

మళ్లీ కాసేపు ఆలోచించి “సరే నువ్వు డైరెక్టుగా లాబ్ కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చెయ్యి” అన్నాడు..

నేను మళ్లీ కిందకి పరిగెత్తి లాబ్ లోకి వెళ్లగానే రెండు జావా ప్రోగ్రాములూ,ఒక జావా స్క్రిప్ట్ ప్రోగ్రామూ ఇచ్చారు..

౧)జావా ప్రోగ్రాము:ఒక ఫైలులో ఒక స్ట్రింగ్ ని ఇంకో స్ట్రింగ్ తో రీప్లేస్ చేసి రెండిటినీ ప్రింట్ చెయ్యటం.

౨)జావా ప్రోగ్రాము:డైరెక్టరీ లో ఉన్న ఫైల్స్,సబ్ డైరెక్టరీస్ లను డిస్ప్లే చెయ్యటం.

౩)జావా స్క్రిప్ట్ ప్రోగ్రాము:ఓ యూ.ఐ ని డిజైన్ చేసి స్ట్రింగ్ అప్పర్ టూ లోవర్ ఇంకా అలాంటి వి ఒక ఆరు పర్ఫార్మ్ చెయ్యమన్నారు.

మామూలుగా అయితే చెయ్యొచ్చు..కానీ అప్పటికే పదకొండుంబావు కావస్తుంది..మళ్లా పన్నెండు కళ్లా అయిపోవాలి..సరే అని 

నేను ఒక ప్లాన్ వేసాను..

౧)మొదటి ప్రొగ్రామ్ కి MyTextEditor అని పేరు పెట్టి లోపల కేవలం ఈ కోడ్ రాసాను..

S.o.p(“String to be replaced:”+”Tokka”);   

S.o.p(“String to be replaced with:”+”Totakura”);

S.o.p(“String now replaced as:”+”Totakura”);

ఎగ్జిక్యూట్ చెయ్యగానే ఇలాగే స్కీన్ మీద కనిపించింది..అక్కడున్న ఓ ఎగ్జామినర్ ని పిలచి ఔట్ పుట్ అని చూపించగానే కోడ్ చూడకుండా ఓ.కె అంది..నాకేమో నవ్వు ఆగట్లే..

౨)ఇక రెండో ప్రోగ్రామ్ కూడా ఓ పది S.o.p() లు అందులో ఓ ఎనమిదిఏమో ఫైళ్లట..మిగతావి డైరెక్టరీ లట ..మళ్లీ చూపిస్తే 

మళ్లీ ఓ.కె  ఎగ్జిక్యూటెడ్ అంది…

కిందపడి నవ్వుకోవాలనిపించే సిట్యుయేషన్…

౩)మూడో ప్రోగ్రాము కి నేను యూ.ఐ డిజైన్ చేసే సరికే నాకు ఓ పదినిముషాలు పట్టింది..అప్పటికే టైమ్ పదకొండూ నలభై దగ్గర పడింది..ఇది కూడా కంప్లీట్ చేస్తేనే ఇంటర్వ్యూ .. ఇక చూడాలి టెన్షన్..ఓ ఆరు రేడియో బటన్లకి ఆరు ఆప్షన్లు పెట్టి పైన స్ట్రింగ్ అప్పర్ టూ లోవర్ పెట్టి ఆ ఒక్క దానికే కోడ్ రాసాను..ఏమైతే అదే అని మళ్లీ పిలిచి చూపించాను..మిగతావి కూడా పెర్ఫార్మ్ చేసి చూపించమనకుండా..”WellDone!You executed all three,prepare for interview” అంది..

మరప్పుడు టైమేమో పదకొండూ యాభయ్యయిదు… 

బయటికొస్తుంటే ఇందాక పైన కనిపించినవాడు నన్ను డౌట్ గా చూశాడు,అప్పుడే అయిపోయిందా అన్నట్లు.నేను కూల్ గా బయటికి వచ్చా కాని మనసులో మాత్రం డౌట్ వీడు ఇప్పుడు లోపలికెళ్ళి గెలకడు కదా అని….

అలా జరగలేదు..ఆ తర్వాత కొన్ని రోజులకి ఫోన్ చేసి ఇంటర్వూ డేట్ చెప్పారు..కానీ అదేంటో అదేరోజు నేను అప్పుడెప్పుడో అప్లై చేసిన ఎయిర్ఫోర్స్ జాబ్ కి కూడా ఇంటర్వ్యూ కి రమ్మని వచ్చింది..బాగా ఆలోచించి ఎవడో నడిపే విమానమ్ లో పనిచేసే బదులు ఈ సాఫ్ట్వేర్ జాబు ల్లో సెటిలయి పోయి నేనే ఓ కారు కొనుక్కొని నడుపుకోవటం బెటర్ అని డిసైడయి పోయాను..

అది నా ఇంటర్వ్యూ రోజు…

ఆ రోజు మాత్రం పది నిముషాలు ముందుగానే వెళ్ళాను..కొందరు బుక్స్ పట్టుకొని చదువు తుంటే మనం మాత్రం సొల్లు కబుర్లు 

చెపుతూ కూర్చున్నాం….

చివరికి నా పేరు పిలవగానే పైకి లేచి “ఏంటి! ఎవరూ హాపీ బర్త్ డే చెప్పరా” అన్నా,అందరూ నన్ను వింతగా చూస్తుంటే నేనేదో పెద్ద జోకేసినట్టు నవ్వుతూ వెళ్ళా ఇంటర్వ్యూ రూము లోకి…టేబుల్ కి అటువైపు ముగ్గురున్నారు.నేను లోపలికి వెళ్లగానే ఒకతనికి ఫోన్ వచ్చి బయటికి వెళ్ళాడు..ఇంకోఅతనికి ఏం వచ్చిందో తెలీదు కానీ అతను కూడా వెళ్ళాడు,నేను మా పి.ఎమ్[కాబోయే..] మిగిలాం.  

చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ చదువుకున్న “core java” నుండి..డబ్బులు కట్టి శ్రద్దగా InetSolv లో నేర్చుకున్న j2ee వరకూ అడుగుతూనే ………ఉన్నాడు.గంట సేపటికన్నా ఎక్కువే జరిగింది ఇంటర్వ్యూ నన్ను ఓ పక్కగా కూర్చోపట్టి తను అడగటం నేను ఏ..దో చెప్పటం లేదా రాయటం,ఇంతలో ఓ ముగ్గుర్ని పిలిచి ఇంటర్వ్యూ చేసి కూడా పంపించాడు.struts వరకూ వచ్చాక ఇక నాకు ఏం రావు అని చెపితే వదిలేసాడు..బయటికి వచ్చాక ఒక డౌట్ నేను అన్నీ కరెక్ట్ గా చెప్పానని “అబ్బో కేక!” అని అడిగాడా..లేక తప్పు చెప్తుంటే కాసేపు ఆడుకుందాం అని ఆడుకున్నాడా అని….

మళ్ళీ రొటీన్ లో పడిపోయాను..ఓ రోజు రాత్రి ఒంటిగంటకి మళ్ళీ శ్యామ్ ఫోన్ చేసి “పార్టీ ఎప్పుడిస్తున్నావ్!” అన్నాడు..ఎందుకన్నయ్యా అంటే “తమ్ముడూ!ఇప్పుడే నీ మెయిల్ చూసాను నీకు జాబ్ ఒచ్చింది” అన్నాడు.

నేను తరవాతేపుడో మెయిల్ చెక్ చేసుకుంటే కరెక్ట్ గా నేను చూసుకున్న రోజే జాయిన్ అవమని ఉంది..ఆ తరవాతనుండి నాలుగురోజులు సెలవలు సంక్రాంతి కి..అయ్యో అనుకొని మళ్ళీ కాల్ చేసాను..ఇవాళే వచ్చి జాయిన్ అవ్వు తరువాత అంటే కుదరదు అన్నారు.

“ఎలాగూ..నేను మా ఇంటినుండి తెచ్చుకున్న పొగరు అలాగే ఉందికద అందుకని..ఆ.. బొంగు లే!” అని అనుకొని మా ఊరెళ్ళిపోయాను జాయిన్ కాకుండానే..

మళ్లీ ఊరినుండి వచ్చాక జాయిన్ అయ్యాను జాబ్ లో..

ఈ ఉద్యోగం ఆర్దికంగా నాకేమిచ్చిందో కానీ ఒక ఇద్దరు చాలా..చాలా మంచి ఫ్రెండ్స్ ని ఇచ్చింది[అరవింద్,వంశి].ఇంకా ఓ యాభై దాకా మంచి ఫ్రెండ్స్ ని..చాలా మెంటల్ మెచ్యూరిటీ ని..ఎబిలిటీ ని..ఇంకా చాలా ఇచ్చింది..

నేను ౩౧-౧-౨౦౦౭[31-1-2007] లో జాబ్ మానేసే వరకు చాలా అనుభవాలు..ఇకనుండి అవి ఇక్కడ..ఒక్కొక్క పోస్టూ క్లైమాక్స్ లా ఉంటది..మిస్ కాకండి..

అరే వంశీ గా నువ్ మాత్రం ఇవి చదివి నన్ను తిట్టొద్దు..కొట్టొద్దు ..ముందే చెపుతున్న….

జనవరి 29, 2009 Posted by | నేనూ-IEG | అభిప్రాయములు

   

Follow

Get every new post delivered to your Inbox.