తొక్కలో కథ:తేలు..తొండ..ఓ పురుగు.
అది ఓ ఊరు..ఊర్లో ఓ ఇల్లు..ఆ ఇంటివాళ్లు బాగానే ఉన్నవాళ్లు..కానీ ఇప్పుడు పట్నానికి వలస వెళ్లడంతో ఇంటికి తాళం తప్ప ఇంట్లో ఎవరూ లేరు..
ఆ ఇంటాయన ఇంట్లోనే ఓ టాంక్ కట్టించాడు,పైన మూత లేదు కానీ వాడకం లేకపోవడంవల్ల లోపల చెత్త పేరుకుంది.ఓ రోజు ఓ తొండ ఇంట్లో తిరుగుతూ తిరుగుతూ ఉండగా వేరే తొండ తో గొడవ జరిగి పరిగెత్తుతుండగా ఈ టాంక్ ఎక్కి అందులో పడిపోయింది.ఆ తరువాత మళ్లీ బయతకి వెళదామంటే పాపం జారుతూ అందులోనే ఉండిపోయింది,అలా అది ప్రయత్నిస్తుండగా పైన ఏదో కనిపించింది,చూస్తే ఒక తేలు టాంక్ గోడ పై తిరుగుతోంది తిరుగుతున్నదల్లా టాంక్ లోకి దిగిదామని ప్రయత్నిస్తూ అందులో పడిపోయింది.
అదిగో ఆహారం అని పరిగెత్తుకొచ్చింది తొండ.ఆ అలికిడికి బెదరి దాడికి సిద్దమైంది తేలు..కొండి చూపిస్తూ భయపెడుతోంది తేలు..నోరు తెరచి భయపెడుతోంది తొండ.కాసేపయ్యేసరికి టాంక్ కి చెరోపక్క చేరాయవిరెండూ,కానీ ఏదీ కదలట్లేదు ఎక్కడ మిగతాది మళ్లీ వస్తుందో అని కానీ ఒకదాన్నొకటి గమనిస్తూనే ఉన్నాయి.మెళ్లిగా ఆకలి మొదలయింది వాటికి అయినా కదలకుండా అలాగే పడుకున్నాయి ఒకదాన్ని మరోటి గమనిస్తూ…
ఇంతలో చెత్తలో చప్పుడయింది ఆకులలో కదలిక మొదలయింది,అంతే ఆ రెండిటి చూపూ మరొకదానిమించి ఆ చప్పుడు అయిన వైపుకి తిరిగింది,కానీ ఇంకా కదలకుండా అలానే ఉన్నాయి.
ఇంతలో ఆకుల కిందనుంచి బయటకు ఒచ్చిందో పురుగు దాన్ని చూడగానే నోరూరింది రెండిటికి ఆ పురుగేమో రెండిటికీ దూరంగానే ఉంది ఎక్కడ కదలితే వేరేది ఒచ్చి తింటుందేమో అని అలాగే కదలకుండా ఉన్నాయవి.
బయటకి వచ్చిన పురుగు చుట్టూ చూసింది దానికేమీ తేడా అనిపించలేదు మెళ్లిగా తొండ ఉన్నవైపు కదలడం మొదలుపెట్టింది.అది చూసిన తేలు వెంటనే పరిగెత్తి దాన్ని తిందామనుకుంది కానీ ఇంతకుముందు తొండ బెదిరింపు గుర్తొచ్చి అలా చూస్తూ ఉండిపోయింది.
అలా నడుస్తున్న పురుగుకి మెల్లిగా ఏదో అనుమానం మొదలయింది,ఎదురుగా తెల్లగా ఓ చిన్నకొండ లా ఓ ఆకారం కనిపించసాగింది.తొండ శ్వాస తీసుకుంటున్నప్పుడు జరిగే కదలికని చూసింది అంతే అక్కడేదో ప్రమాదం ఉన్నట్లనిపించి వెంటనే వెనక్కితిరిగింది అది చూసి తొండ అయ్యో అనుకుంది కనీ ఏమీ చెయ్యలేక అలాగే చూస్తోంది..
ఇప్పుడు ఆ పురుగు వేగంగా వెళ్లటం మొదలుపెట్టింది.అది చూసిన తేలు ఇది నా వైపే వస్తోందని కదలకుండా అలాగే చూస్తోంది కానీ పురుగు తేలు వైపు రాకుండా ఇంతకుముందు అది ఎక్కడినుంచి వచ్చిందో అక్కడే ఆగింది,ఆ పురుగు మళ్లీ లోపలికి వెళ్లటానికి సిద్దం అయింది.
పురుగు నావైపే వస్తుంది,తినాలి అని పురుగు గురించే ఆలోచిస్తున్న తేలు తొండ ని మరచిపోయింది.ఆ పురుగు మళ్లీ ఆకులలోపలికి పోకముందే తినాలని పరిగెత్తింది తేలు.అది అలా కదలటం తొండ చూసింది దానికి తేలు ఉద్దేశ్యం అర్దమైంది అంతే పరిగెత్తుకొచ్చింది పురుగు వైపు నోరుతెరచుకొని.
హటాత్తుగా జరిగిన అలికిడికి పురుగు లోపలికి వెళ్లకుండా ఉండటమే అది చేసిన తప్పు…
వేగంగా పరిగెత్తుకొచ్చిన తేలు ఒక కొండి తో పురుగుని పట్టుకుంది తినదానికి నోటిదగ్గర పెట్టుకోబోతూ ఎదురుగా నోరు తెరచుకొని పరిగెత్తుకొస్తున్న తొండ ని చూసి పురుగుని పక్కగా పట్టుకుంది..తెలు పురుగుని నోటి దగ్గరనుంచి జరిపిన విషయం గమనించని తొండ తేలు తలని నోట్లో పట్టుకొని కొరికింది,వెంటనే తేలు కొండి తో తొండ ని కాటేసింది.తేలు చేతిలో పురుగు అలానే ఉంది,ఆ పట్టు ధాటికి కొంచం కొంచం గా ప్రాణం విడుస్తూ..
ఇక్కడ తొండ తేలు ని అలాగే పట్టుకుంది అది కరుస్తున్నప్పటికీ…
తలుపు తీసుకొని లోపలికొచ్చాడు ఆ ఇంటాయన అన్నీ చూస్తూ ఆ టాంక్ దగ్గరకొచ్చాడు.వెంటనే “అరేయ్!రాముడూ,టాంక్ లో ఏవో చచ్చాయి,తీసేసి కడుగు” అన్నాడు..
“ఆలాగేనయ్యా!”అని రాముడు వచ్చిచూస్తే ఎముకలుగా మారిన తొండ ,పొర లా మారిన తేలు,పురుగు రెక్కలు కనిపించాయి..
గమనిక:ఇలా ఒకసారి ఒక ఇంట్లో చచ్చిపడున్న ఈ మూడింటిని చూశాను,ఎందుకో కథలా రాయాలనిపించింది..అదే ఇది….
-
ఖజానాలు
- ఏప్రియల్ 2012 (1)
- డిసెంబరు 2011 (3)
- అక్టోబర్ 2011 (1)
- జులై 2011 (1)
- మే 2011 (2)
- ఫిబ్రవరి 2011 (1)
- జనవరి 2011 (1)
- నవంబరు 2010 (8)
- అక్టోబర్ 2010 (2)
- జులై 2010 (1)
- జూన్ 2010 (2)
- మే 2010 (1)
-
వర్గములు:
-
RSS
ఆర్ యస్ యస్ ద్వారాలు
వ్యాఖ్యలు RSS
