అయ్యో,కలలేమయ్యాయ్,
అయ్యో,కలలేమయ్యాయ్,
కన్నీటికి కరిగిపోయాయ్,
అవునా! మరి కన్నీళ్లేమయ్యాయ్,
చేతులు వాటిని చెరిపేసాయ్,
హమ్మాయ్య! మరి తుడిచిన చేతులేమయ్యాయ్,
గతాన్ని మరవమని గుండెకి చెప్పి కాళ్లని ముందుకు తీసుకెళ్లాయ్,
భలే,భలే, మరా కాళ్లెక్కడికెళ్లాయ్,
కాళ్లా…
కింద చూస్కో నువ్ ఆ కాళ్లమీదే ఉన్నావోయ్.
నాకో…..తోడుదొరికింది
నా జీవితంలోకి మార్పు వచ్చింది,
చిరుచీకటిలో ఉన్న నా జీవితంలోకి,
ఓ చందమామ నడిచొచ్చింది,
కాలాన్ని నా చేతుల్లో కరిగించేందుకు,
నాకో మంత్రగత్తె దొరికింది,
నా జీవితంలోకి మార్పు వచ్చింది,
మొన్నే నాకు పెళ్లయింది,
నాకో…..తోడుదొరికింది.
అన్నీ నేనే …నేను స్థితప్రజ్ణున్ని…
చంటిపాప చేతిలో కదలిక నేను,
ముసలాడి చేతిలో కర్రను నేను,
కను కొనలో నీటిని నేను,
నీటికై వెదికే కన్నుని నేను,
భూమిని తాకే వానని నేను,
భూమి నుండి లేచే మంటని నేను,
రోడ్డుపక్క చచ్చిపడున్న కుక్కనీ నేనే,
రోడ్డుకావళ గుళ్లో ఉన్న దేవున్నీ నేనే,
ముసలిదైన పులీ నేనే,
ఇప్పుడే పుట్టిన జింకా నేనే,
కాటు వేసే చీమా నేనే,
ప్రళయకాళపు ప్రశాంతతని నేను,
అశాంతి…
విశ్రాంతి…
విభూదీ…
సమాధీ…
అన్నీ నేనే…
అందుకే నేను స్థితప్రజ్ణున్ని…
…అంటే ప్రజ్ణ ని కలిగిఉన్నవాణ్ణి…
…ఆకలిని ఓర్చుకోవటమూ ప్రజ్ణే…
…అరచి ఊరుకోవటమూ ప్రజ్ణే…
పులి నోరు..జింక మెడ
ఎప్పుడూ పులే జింక మెడ ఎందుకు కొరకాలి…
ఏ..
పులికీ మెడ ఉందే..
జింకకీ నోరు ఉందే..
మరి జింక పులి మెడ ఎందుకు కొరకదని అడిగా..
నా స్నేహితున్ని….
అప్పుడు వాడన్నాడు..
పులికి ధైర్యం ఉంది…
జింకకి భయం ఉంది..
అని..
అప్పుడు నాకు సమాజంలో నాతో సహా చాలా జింకలు కనిపించాయి….
కల..కళ్లముందుకు…
కలలో వచ్చిన ఆలోచన,
కనులముందు కదులుతుంటే,
హ్రుదయానికి నచ్చి,
నా చేతులతో..చేతలతో పూర్తిచేసి..
చూస్తే…
మది ఉప్పొంగింది..
చేతులు చప్పట్లు కొట్టాయి..
కల కళ్లముందుకు వచ్చినందుకు…
నా గుండెకి నాలుగు గదులు..నా ఇంటికి ఒకటే..
నా గుండెకి నాలుగు గదులు..
నా ఇంటికి ఒకటే గది…
నా అవయవాల ఖరీదు…
నా అప్పు కన్నా చాలా ఎక్కువ…
సంపద తనలో ఇముడ్చుకున్న దేశం నాది…
నేనూ అంతే సగటు భారతీయున్ని….
తాత..నాన్న..నేను..కొడుకు…మనమడు…
బతకటానికి మా నాన్న పల్లె నుంచి పట్నానికి వచ్చాడు..
నేను పట్నం నుంచి నగరానికి వచ్చాను…
రేపు నా కొడుకు మహానగరానికి…
వాడి కొడుకు ఇంకో దగ్గరకి…
కానీ..
మా నాన్న విడిచి వచ్చిన పల్లెలో..
ఇంకా జనం బతుకుతున్నారు,సంతోషంగా ఉన్నారు..
జీవితంలో అంతకన్నా ఎదో ఉంటుందని మేము మాత్రం..
సంచారులమయ్యాం..
రేపు ఎప్పుడో మాకు చెందినవాడు మళ్లీ..
మా గడ్డ పై అడుగుపెట్టిన నాడు..
ప్రక్రుతి ఫక్కున నవ్వి చెపుతుందేమో..
“ఎక్కడ మొదలైంది మళ్లీ అక్కడకే వస్తుందని” …
కానీ నా ఊరివాళ్లే అడుగుతారేమో..
“ఎవరూ?…అని……”
నోట్: ఇలా రాసానని నేను గ్లోబలైజేషన్ కి వ్యతిరేకం కాదు..మొన్న ఎప్పుడో ఏదో పత్రికలో ఈ టాపిక్ పై వ్యాసం చదివాక రాయాలనిపించింది.
చీకటి..నేను..దేవుడు..దయ్యం..
చీకట్లో గదిలో ఒంటరిగా నేనుంటే..
హఠాత్తుగా ఒక ఆకారం కనిపించింది..
భయంగా అడిగాను “నువ్వు దయ్యనివా అని”..
సమాధానం వచ్చింది “నేను దేవున్ని అని”..
కష్టం..సుఖం..ఆశ
కష్టాలను మించిన ఆప్తులు,
నిండుకుండ..వడ్డించిన విస్తరి..
అవును నిజమే..
నిండు కుండ తొణకదు..
వడ్డించిన విస్తరి ఎగరదు..
కానీ..
తాగటానికి కాకపోతే నింపటం ఎందుకు..
తినటానికి కాకపొతే వడ్డించటం ఎందుకు..
తొణకకపోతే నిలదొక్కుకోవటం నేర్చుకొవటం ఎలా..
ఎగిరిపడకపొతే లేవటం నేర్చుకొవటం ఎలా..
-
ఖజానాలు
- ఏప్రియల్ 2012 (1)
- డిసెంబరు 2011 (3)
- అక్టోబర్ 2011 (1)
- జులై 2011 (1)
- మే 2011 (2)
- ఫిబ్రవరి 2011 (1)
- జనవరి 2011 (1)
- నవంబరు 2010 (8)
- అక్టోబర్ 2010 (2)
- జులై 2010 (1)
- జూన్ 2010 (2)
- మే 2010 (1)
-
వర్గములు:
-
RSS
ఆర్ యస్ యస్ ద్వారాలు
వ్యాఖ్యలు RSS
