అనంతమైన ఆలోచనలు

నా ఆలోచనలు..నా దారి…

ఈ సి.ఐ గారికి పుస్తకాలంటే చాలా ఇష్టం……….

విజయ్ కుమార్ గారు సిద్దిపేట సి.ఐ గా పనిచేస్తున్నారు,వీరితో ఈ  పరిచయం అనుకోకుండా జరిగింది.
సిద్దిపేట లో ఒక ఫ్రెండ్ ఉన్నారు పేరు బాలలింగం,ఇతనికి బస్టాండ్ దగ్గర “రాజ్ బుక్స్” షాప్ ఉంది,ఇతను మంచి పుస్తక ప్రియుడు,షాప్ లో కూడా పుస్తకాలని చాలా బాగా మైన్టైన్ చేస్తారు.అన్ని రకాల పుస్తకాలు అక్కడ ఉండేలా జాగ్రత్త తీసుకుని సంపాదన మీద కాకుండా పుస్తక ప్రియులని అలరించేలా షాప్ ని రన్ చేస్తున్నారు.
మొన్న ఒక రోజు కొత్త పుస్తకాలు ఏమొచ్చాయో చూడడానికి వెళ్లినప్పుడు అక్కడికి వచ్చారు సి.ఐ గారు,
అసలు ఎంత సరదాగా కలిసి పోయారంటే కొత్తగా అప్పుడే పరిచయం అయినట్టే అనిపించలేదు,పైగా సి.ఐ అన్న ఫీలింగ్ కూడా లేకుండా ఆ ఫీలింగ్ నాకు కనీసం రానీయకుండా కలిసిపోయారు.
సార్ తో మాట్లాడడం ఒక పుస్తకం చదవటంతో సమానం,ఆయన ఉద్దేశ్యంలో మనిషి ఎప్పుడయినా చేసుకోగలిగిన అలవాటు ,మంచి అలవాటు పుస్తక పటనం,
“Teaching without Learning,Learning without Teaching”
అంటూ కొటేషన్స్ తో మాట్లాడారు,వారి మాటలు వింటుంటే మీ అందరికీ పరిచయం చేయాలనిపించి
“సార్!ఒక రోజు మీరు టైమ్ ఇవ్వాలి,మీ ఇంటర్వూ కావాలి” అన్నాను.
అప్పుడాయన పర్లేదు ఇప్పుడు మాట్లాడుకుందాం అని అన్నారు…..
మీరు చూడబోయే వీడియో నేను ఆయనతో మాట్లాడిన మాటలు…
ఆయన ఎంత ఓపెనో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది..

ఆయన గురించి బయట నను తెలుసుకున్న వియం ఏమిటంటే ,ఎవరయినా చిన్న చిన్న గొడవలు అలా స్టేషన్ కి వచ్చిన వాళ్లు ఉంటే వాళ్లకు కౌన్సిలింగ్ చేసి కొన్ని పుస్తకాలను చదవమని సూచించి,వాళ్లను చదివించి వాళ్లలో మార్పు తేవటానికి ట్రై చేస్తారని తెలిసింది.

ఆయనకి వృత్తిలో నూ , మానసికంగానూ ఎప్పుడూ సంతషం కలగాలని కోరుకుంటున్నాను.

చదివినందుకు మీ అందరికీ కృతజ్ణతలు…….

కింద ఫోటోలో్ నేనూ,సి.ఐ గారూ,మా బాలలింగం అన్న…..

డిసెంబరు 18, 2011 - Posted by | అనంతమైన ఆలోచనలు..

అభిప్రాయములు »

  1. Good Post. మన మీడియా ఇటువంటి అద్భుత వార్తలను పట్టించుకోదు. బ్లాగరుగా మీరు ఈ సి ఐ గారి గురించి అందరికీ తెలియచేయటం ముదావహం.

    వ్యాఖ్య ద్వారా శివరామప్రసాదు కప్పగంతు | డిసెంబరు 19, 2011 | జవాబు

  2. అయ్యో! పోలీసుల్లో ఇటువంటివాళ్ళున్నారా?

    వ్యాఖ్య ద్వారా kastephale | డిసెంబరు 19, 2011 | జవాబు

  3. సి.ఐ గారికి నా నమస్కారాలు చెప్పండి,చాలా సంతోషంగా ఉంది వారి గురించి పరిచయంచేసినందుకు ధన్యవాదాలు….వారి బ్లాగు ఏదయినా ఉందా …??

    వ్యాఖ్య ద్వారా సోము | జనవరి 5, 2012 | జవాబు

  4. Good interview and books reccommended by CI sir are good books.Monk who sold his Ferrari is a good book..

    వ్యాఖ్య ద్వారా phani mamidala | జనవరి 5, 2012 | జవాబు

  5. Nice idea..!

    వ్యాఖ్య ద్వారా pranav inavolu | జనవరి 5, 2012 | జవాబు

  6. interrogating C.I
    great bro…

    వ్యాఖ్య ద్వారా chintu srikanth | జనవరి 5, 2012 | జవాబు

    • శ్రీకాంత్ ఇంటరాగేషన్ అంత సీన్ లేదమ్మా…ఏదో ఆమాత్రం మాట్లాడానంటే సి.ఐ గారి మంచితనం వల్లే….ఆయన కనక అలా ఉండకపోతే నోట్లోంచి మాట కూడా వచ్చేది కాదు…..:)

      వ్యాఖ్య ద్వారా భాస్కరవఝ్ఝుల శ్రవణ్ కుమార్ | జనవరి 5, 2012 | జవాబు


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.