థంబ్ రూల్..రెండంచెల పోలీసు వ్యవస్త..మంచి సమాచార వ్యవస్త..నా ఆలోచనలు..
ప్రకామ్య==కోరింది నెరవేర్చుకోవటం.
సరే నా వయసు కేవలం 26 సంవత్సరాలు..నేను రాజకీయాలగురించి మాట్లడడం ఏంటి…
వాటి పై పోరాడడం ఏంటి..
అందుకే నేను నాకు గత 26 సంవత్సరాలుగా పరిచయం ఉన్న ఈ వ్యవస్త పై పోరాడదలచుకున్నాను.. అవును వ్యవస్త పైనే ఎందుకంటే మనలోంచి ఒకడు మనల్ని పరిపాలించటానికి వచ్చి మనల్ని మనం పరిపాలించుకుందాం అనకుండా నేను ప్రజల్ని పాలిస్తా ప్రజలకోసం పనిచేస్తా అని మనల్నించి ఎందుకు వేరు చేసుకుంటున్నాడు ..
మనమూ వాల్లని ఎందుకు రాజుల్లాగా చూస్తున్నాం ?? సేవకుల్లాగా కాల్లు మొక్కుతున్నాం.. నిజం చెప్పండి ఎంతమందికి గవర్నమెంట్ సార్వెంట్స్ అయిన ఉద్యోగులతో అవసరం వచ్చింది ఎంతమంది డబ్బులిచ్చి పని చేయించుకున్నారు??
నేను రోడ్డు మీద వెలితే పోలీసు నన్ను ఎందుకు అరేయ్ అని పిలవాలి వ్యవస్త లో లోపాలు ఉన్నంత వరకూ ఎవరు పాలిస్తున్నా ఎవరు పనిచేస్తున్నా ఇలాగే ఉంటుందేమో … సరే నేను ఒక మూడు ఉపాయాలు చెపుతా …
1)థంబ్ రూల్ 2)రెండు అంచెల పోలీసు వ్యవస్త 3)ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక మంచి సమాచార మార్గం
సరే థంబ్ రూల్ అంటే ప్రజల దగ్గర నుంచి వేలి ముద్రలు తీసుకొని వోటింగ్ మెషీన్లలో టెస్ట్ చేయాలి వోటు వేసేముందు..అంటే దొంగ వోట్లు వేసే అవకాశంలేకుండా చేయాలి.ఇప్పుడెలాగూ ఈ.వి.ఎం లు వాడుతున్నాంగా..
ఇంకో విషయం ఎవడు తప్పుచేసినా వాడు ఎవడో తెలిసి పోతుంది ఎందుకంటే మన దగ్గర దేశం లో ని ప్రజలందరి వేలిముద్రలు ఉంటాయిగా
[తిరుపతి లో మీరు మధ్య రాత్రి గుడి చుట్టూ పొర్లుదండాలు పెట్టాలంటే రాత్రి 8:00 కి మీ వేలి ముద్రలు తీసుకొని మీరు తడిబట్టలతో వచ్చినా సరే రాత్రి 3:00 గంటలకి కి మల్లీ వచ్చింది మీరేనా కాదా అని మల్లీ మీ వేలిముద్ర చెక్ చేసి చూసి మరీ లోపలికి వదులుతారు ..అక్కడే అలా ఉన్నప్పుడు ఇంత పెద్ద దేశంలో ప్రజలని పాలించే అవకాశం కల్పించాలి అంటే ఇలాంటి వ్యవస్త లేదు.. ]
ఇక రెండు అంచెల పోలీసు వ్యవస్త అంటే పోలీసులని రెండు విభాగాలుగా విభజించాలి: సివిల్ పోలీసులు క్రిమినల్ పోలీసులు సివిల్ పోలీసులు కేవలం ప్రజలని ప్రశ్నించటానికి వారికి రక్షణ కల్పించటానికి మాత్రమే వారికి ప్రజలని కొట్టి బెదిరించే అధికారం ఉండకూడదు..వీరినే రాజకీయ నాయకులకి గన్మెన్లు గా ఇవ్వాలి..
ఇక క్రిమినల్ పోలీసులు వీరికి మాత్రమే ప్రజలని దండించే అధికారం ఉండాలి అది కూ డా కోర్ట్ అనుమతి + సివిల్ పోలీసుల అనుమతి తో మాత్రమే వీరికి ప్రజలని నేరుగా బెదిరించే అధికారం ఇవ్వకూడదు..
పోలీసుల పై వారి పనితీరు పై సమీక్షించే అధికారం వారి బదిలీలను పర్యవేక్షించటం చూడటానికి ఒక సమితి ఉండాలి అందులో ముఖ్యమంత్రి +హోం మంత్రి +రెండు పోలీసులలోంచి ఇద్దరు నాయకులు + హై కోర్టు జడ్జి ఉండాలి .ఇంకెవరికీ పోలీసుల పై అధికారం ఉండొధ్దు.
ఇలా ఎందుకంటే మన ఆర్మీ + మన పోలీసులు ఇద్దరూ మనకో సమే పని చేస్తున్నా వారి మధ్య తే డాలుంటాయి .. దాంతో ఒకరి తప్పు చేస్తే ఇంకొకరు దాన్ని ఆపుతారు ..కానీ పోలీసులంతా ఒకటే అయినపుడు తప్పులన్నీ మాయం అవుతాయి మనవాడేకదా అని వదిలివేయబడతాయి… అందుకే రెండు అంచెల వ్యవస్త ఉండాలి దేని కదే ప్రత్యేకం అని పించాలి అప్పుడే సామాన్యులకి న్యాయం జరుగుతుంది.. ఇప్పుడు చూడండి కనీసం మన అసంత్రుప్తి చెప్పుకోవాలన్నా పోలీసులు కొట్టి కాల్చి చంపుతారు మొన్న మొన్న స్కూలు పిల్లలని కూడా కొట్టారు ఎక్కడో
ఒక వేల కనుక ఇలాగే జరిగితూ ఉంటే మనం పోలీసు సహాయ నిరాకరణ చేయటం మాత్రమే పరిశ్కారం కాబోలు అంటే పోలీసులని సాంఘికంగా బహిశ్కరించటం [కానీ పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం కదా ] అందుకే పోలీసులకి తప్పుచేసే అవకాశాన్ని తగ్గిదాం …
ఇక మూడవది ముఖ్యమైనది సమాచార వ్యవస్త అంటే ఇప్పుదు లేదని కాదు కాని ఇంతకన్న మంచిది కావాలి … సరే ఇప్పుడు లోపం ఏంటంటే .. ప్రభుత్వం రైతులకి ఏ దైనా సహాయం విడుదల చేసిందనుకోండి మధ్యలో ఎవరైనా దాన్ని తీసుకోవచ్చు .. ఎప్పటి వరకూ ఆ ప్రజలకు అది విడుదల అయిందని తెలియనంత వరకూ మాత్రమే ఇప్పుడు కావలసింది అలాంటి సమాచార వ్యవస్త మాత్రమే
అలాగే ప్రభుత్వం ఒక వెబ్ సైట్ మైంటైన్ చెయ్యాలి అందులో ప్రజల డబ్బుని గురించి న వివరాలు ఉండాలి అంటే ప్రభుత్వానికి వచ్చిన డబ్బు ఎంత దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు ఒక ఉద్యోగికి ఎంత జీతం వస్తోందో తెలిస్తే నే కద మనం అతన్ని ప్రష్నించేది ఇలా నువ్వు ఎల బ్రతుకుతున్నావ్ ఇంత డబ్బు నీకు ఎలా వచ్చింది అని? అలాగే ఏ కాంట్రాక్టర్కు ఎంత ఇస్తున్నారు అతడు క్వాలిటీ ఎలా మైంటైన్ చేస్తున్నాడు అని ఇప్పుడు కూడా ఈ విషయాలు చెపుతారు సమాచార హక్కు కింద
అంటే చెప్పటాని ఏమీ అభ్యంతరం లేదు అలాంటప్పుడు ఇలా చెపితే బాగుంటుందేమో…
అవండి నా ఆలోచనలు నచ్చితే మీరు కూడా ఇక్కడ రాయవచ్చు చెపితే మిమ్మల్ని కూడా అథర్ గా ఆడ్ చేస్తాను.. అలాగే ఈ ఆలోచనలు నచ్చితే మీలో ఎవరికైనా వేరే భారతీయ భాషలు వస్తే వాటిలోకి దీన్ని మార్చండి అలాగే యింగ్లీషులోకి కూడా …. చివరగా మల్లీ మొదటిమాట “వ్యవస్త మారనంతవరకూ ఏమీ మారదు ” ఓపికగా ఇదంతా చదివినందుకు సంతోశం ..నచ్చితే మిగతా వాల్లతో కూడా చదివించండి ……. వ్యక్తి నుంచి వ్యక్తి కి ………
Do not wait for Leaders; Do it alone, person to person.
ప్లీజ్ send me english translated copy of this page ..may be you can translate better than me so try and send it back to me thanks in advance….
please submit ur comments
actually this is in my another blog prakamyam.blogspot.com—when i wrote this i got the following comments
రమణి said…
బాగుందండి మీ ఆలోచన. వ్యవస్థని మార్చేయ్యడం మన చేతుల్లో లేదు కాని, ఇది చదివితే ఒక్కరన్నా మారుతారు. మీ ఆలోచనలు అభినందనీయం.
కత్తి మహేష్ కుమార్ said…
ఆలోచనలు బాగానే ఉన్నాయి. మనకు ఫోటో ఓటర్ ID ఇవ్వడానికే శేషన్ ఇన్ని అవస్తలు పడాల్సొచ్చింది. ఇక వేలిముద్రల డేటాబేస్..కష్టమైనా మంచి సూచన.అదొక multipurpose గుర్తింపుగా ఉపయోగపడుతుంది. పాస్ పోర్ట్ కోసం దేబరించాల్సిన ఈ దేశంలో ఇలాంటిదొకటి అవసరమే,అమెరికాలో సోషియల్ సెక్యూరిటీ నంబర్లాగా.
మీరు సూచించిన రెండో పాయింట్ పోలీసువ్యవస్థ reforms కు కిరణ్ బేడీ కమిషన్ సూచించిన కొన్ని సూత్రాలకు దగ్గరగా ఉన్నాయి. దాదాపు 10 సంవత్సరాలుగా అది కేంద్రప్రభుత్వం దగ్గర పడుంటే, అవి ప్రపోజ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి ఒప్పుకుంటాయనే నమ్మకం నాకు ప్రస్త్రుతానికి లేదు.
సమాచార వ్యవస్థ అవసరమే..right to information act వచ్చింతర్వాత ఇలాంటివ్యవస్థ ఏర్పాటుకు అన్ని డిపార్ట్ మెంట్లూ అర్థమనస్కంగా ఈ పనికి పూనుకుంటున్నాయి.
సత్యసాయి కొవ్వలి said…
బాగున్నాయి మీప్రపోజల్స్
లలిత said…
వ్యవస్తని మారుద్దాం, అంటే నిజంగా చల మంది జనాలకి అర్దంకాదు. అదే పార్తీని దించేద్దాం అనగానే వెంటనే రియాక్ట్ అవుతారు. సమజంలో జరిగే ప్రతిమంచి చెడులూ పార్టీలకు అపాదించడం ఎవ్రినివారె పొగుడుకొటం.ఎదుటివారిమేదనిందలెయడం చివరికి వానలు పడి పంటలు పండినా అది పార్టీ గొప్పతనమే అని నమ్మే వెర్రిజనం .డబ్బు మందు లేని ఎలక్షన్ జరిపిద్దం అని J.P గొంతు నొప్పెట్టేలా చెపుతున్న ఒక్కరన్న అతనితో గొంతుకలిపారా? ముందు జనాలకి వ్యవస్తకి ప్రబుత్వనికి తేడా వుందనే విషయం తెలియలి. మీ ఆలోచన బావుంది.
Teja said…
chala baaga alochincharu…..
భాస్కరవఝుల శ్రవణ్ కుమార్ శర్మ said…
అందరికి ధన్యవాదాలు…
ప్లీజ్ ఆర్కుట్ [prakaamya] కమ్యూనిటీ లో జాయిన్ అవ్వండి..అలాగే మిగతా భాశలలోకి తర్జుమా చేయగలిగితే చేసివ్వండి..దేశం మొత్తం మీద నేను ప్రచారం చేద్దామనుకుంటున్నాను….
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said…
పై వ్యాఖ్యాతల శైలితో ఏకీభవించలేకపోతున్నాను. యావత్తు వ్యవస్థని టోకుగా మార్చమని కాదుగా భాస్కరవజ్ఝల గారంటున్నది. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కావాలంటున్నారు. ఇది అసాధ్యమేమీ కాదే !
భావి-టపాలలోనైనా అక్షరదోషాల్ని తగ్గించగలరని మనవి.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి said…
మీ సూచనలు భేషుగ్గా,టోకున చూస్తే చాలా బాగున్నాయి.కానీవాస్తవం కాస్త కంటే చాలా ఎక్కువగా కఠోరంగా ఉంది.సగటు అక్షరాస్యత అంటే మన భారతీయప్రమాణాల ప్రకారం సంతకం చెయ్యడం,అసలదన్నా ఎంతవరకూ వాస్తవమో కేవలం అప్పు తీసుకున్నప్పుడో మరే ఇతర సందర్భాలలో తప్ప ఋజువు కాదు.చట్టం,ప్రభుత్వం,ప్రజలు,అధికార వ్యవస్థా,మరియు మీడియా అందరికీ చదువు తోపాటు సాటి మనుషులమీద,సమకాలీన అంశాల మీద అసక్తితో పాటు భవిష్యత్తు తరాల మీద శ్రద్ధ ఉంటే తప్ప ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు తక్కువ.
మహేష్ గారు,ప్రభుత్వాధికారులకు సమాచారచట్టం గురించి ఇచ్చిన శిక్షణాతరగతుల్లో misinformation అంటే ఏమిటొ,అసలు అడిగిన దానిని ఎలాఎంతకాలం నాన్చాలో,సగంసగం సమాచారం ఇచ్చి ఎలా గందరగోళానికి గురిచెయ్యాలో ఇలాంటి దిక్కుమాలిన విషయాలమీద బాగా తర్ఫీదు ఇచ్చారు,అయినా కొందరు విక్రమార్కుల్లా సాధిస్తున్నారు అనుకోండి.
గాంధీ గారి పుట్టినరోజున మీరు ఈ సూచనలతో ముందుకు రావటం ముదావహం,కానీ ఆయన చెప్పిన నిజాయితీ,నిర్భీతి,నిరాడంబరత ఇవి లోపించటం వల్ల వస్తున్న(కొనితెచ్చుకుంటున్న ఇబ్బందులే ఎక్కువ)
తాడేపల్లి గారన్నట్లు పోలీసువ్యవస్థలో మార్పులు కిరణ్ బేడీ తో పాటు,హోం మంత్రిగా దేవేందర్ గౌడ్ మనకు ఉన్నప్పుడు కూడా నవీనపోలీసుచట్టానికి రూపకల్పన జరిగింది.కానీ అవ్వాళ వారికి అంతకన్నా ముఖ్యమైన పనులు,రాచకార్యాలు ఉండటంతో మూలకు చేరింది.
లలిత గారు, జనం పూర్తిగా వినే స్థాయిలో ఇంకా లోక్ సత్తా స్వరం పెంచాలండి
చంద్ర మోహన్ said…
ఈ పోస్టుకు సంబంధం లేకపోయినా చిన్న సవరణ మీ ప్రొఫైల్ లో:
“రాజశేఖర చరిత్ర” వ్రాసింది గురజాడ కాదు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు. మార్పుచేయగలరు.
అభినందనలు!
వైష్ణవి హరివల్లభ said…
మీ మొదటి సూచన నాకు నచ్చింది.
bhavani said…
మీ ఆలోచనలు బాగున్నాయి. మీరు కూడలిలో గానీ, జల్లెడలోగానీ చేరితే ఇలా ప్రతి ఒక్కరినీ అడిగే బాధ తప్పుతుంది కదా.
భాస్కరవఝుల శ్రవణ్ కుమార్ శర్మ said…
కేవలం నా పోస్ట్ చదవటం కోసమే అయితే కూడలిలో ఎపుడో చేరాను..ఇలా పర్సనల్ గా ఎందుకు అందరికీ మెసేజ్ లు పంపించానంటే ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు ఎవరైనా ఇంకా ఏమైనా సలహాలు సహాయం చేస్తారమోనని…
Uma said…
bhagundi Sravan… acharanaloki vache margam kuda alochinchu
Suneel said…
మీ ఆలోచనలు బాగున్నాయండి. కానీ నూరు కోట్ల జనాభా ఉన్నమన దేశంలో ఇది సాధ్యమేనా!
Like this:
Be the first to like this page.
i like very much to the diparetment.